‘సీతారామం’ నుంచి కీలక సన్నివేశం విడుదల.. నెట్టింట వైరల్

-

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ పిక్చర్ ‘సీతారామం’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ కీలక సన్నివేశాన్ని విడుదల చేశారు. అది చూసిన సినీ ప్రియులు, నెటిజన్లు ఇంత మంచి సన్నివేశాన్ని సినిమా నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

పీరియాడికల్ లవ్ స్టోరిగా వచ్చిన ‘సీతారామం’లో హీరోగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించగా, హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి మృణాళ్ ఠాకూర్ నటించింది. ఇక ఇందులో కీలక పాత్రలో క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటించింది. తెలుగు చిత్ర సీమ నుంచి వచ్చిన ఈ సినిమా చూసి దేశం ఫిదా అయింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు చక్కటి స్పందన వస్తోంది.

తాజాగా మేకర్స్ ఈ ఫిల్మ్ నుంచి డిలీట్ చేసిన సీన్స్ రిలీజ్ చేశారు. ఆ సీన్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సీతా మహాలక్ష్మి కోసం వెతుకుతున్న క్రమంలో రష్మిక మందన ప్యాలెస్ వద్దకు వస్తుంది. అక్కడ తన బ్యాగ్ మిస్ అయిందని తిరిగి తను వచ్చిన క్యాబ్ వద్దకు వస్తుంది. అప్పటికి క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తుండగా, తాను వెనక్కు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశావ్?అని రష్మిక అడుగుతుంది.

ఇంకా ఇండియాలో ఇలాంటి వాళ్లున్నారా? అని అంటుంది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ..ఇండియాలో అందరూ తన లాగే ఉంటారని, బ్యాగ్ తీసుకుపోయి తన దేశం పరువు పంపలేను మేడమ్ అని బదులు చెప్తాడు. ఆ డైలాగ్ విన్న సినీ ప్రియులు వావ్..ఇంత చక్కటి సీన్ ను ఎందుకు డిలీట్ చేశారు? ఇది సినిమాలో ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...