నా భార్య నన్ను అలా పిలుస్తుంది: దుల్కర్​ సల్మాన్

-

సెలబ్రిటీలపై తనదైన స్టైల్​లో పంచులేస్తూ క్యాష్ షోని రక్తికట్టిస్తుంటుంది యాంకర్ సుమ. బుల్లితెరపై సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షో భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. గత కొన్నేళ్లుగా ఈ షోకి నీరాజనం పలుకుతున్నారు బుల్లితెర ఆడియన్స్. సుమ యాంకరింగ్, సెలబ్రిటీలతో ఆట పాట ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటాయి. అయితే ఈ వారం క్యాష్​ కార్యక్రమానికి సీతారామం మూవీ టీం వచ్చి సందడి చేసింది. తాజాగా ఈ ప్రోమోను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.
అయితే క్యాష్ ప్రోగ్రామ్​కు వచ్చిన దుల్కర్ సల్మాన్… తన భార్య తనను ప్రేమగా ఏమని పిలుస్తారో చెప్పారు​. అలాగే తాను కూడా ఆమెను ముద్దుగా ఎలా పిలుస్తారో తెలిపారు.

ఇంకా ఆ షోలో దుల్కర్​తో పాటు సీనియర్​ నటుడు సుమంత్​, దర్శకులు తరుణ్​భాస్కర్​, రాఘపూడి కూడా సందడి చేశారు. సుమతో కలిసి ఫుల్​గా నవ్వులు పూయించారు. ఈ క్రమంలోనే సుమంత్​.. తన మనసు బండరాయి అని చెబుతూ సరదాగా నవ్వించారు. ఇక సుమ-తరుణ్​ మధ్య జరిగిన సంభాషణలు అయితే కితకితలు పెట్టిస్తున్నాయి. అలానే ఈ షోకు వచ్చిన ప్రేక్షకులతో కలిసి దుల్కర్​-సుమంత్​ చిందులేయడం బాగుంది.

కాగా, ‘సీతారామం’ విషయానికొస్తే.. స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కింది. అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మాతలు. ‘అఫ్రీన్‌’ అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటించగా.. మరో కీలక పాత్రలో తరుణ్​భాస్కర్​ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారా చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛాయాగ్రహణం- పి.ఎస్‌.వినోద్‌, సంగీతం- విశాల్‌ చంద్రశేఖర్‌, కూర్పు- కోటగిరి వెంకటేశ్వరరావు, కళ- వైష్ణవిరెడ్డి, ప్రొడక్షన్‌ డిజైన్‌- సునీల్‌ బాబు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version