Sneha: మోడ్రన్ డ్రెస్సులో స్నేహ..వన్నె తగ్గని అందం ఆమె సొంతం

-

సీనియర్ హీరోయిన్ స్నేహ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. హీరోయిన్ గా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ నటి..ఆ తర్వాత ఇతర భాషల్లోనూ చక్కటి అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. అనిల్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఇగను ఒరు నీలపక్షి’’ అనే సినిమాతో హీరోయిన్ అయింది స్నేహ.

నాలుగు పదుల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ నటి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన భర్త తీసిన ఫొటోలు షేర్ చేసింది.

జీన్స్ టాప్ లో కూల్ గా కూర్చొని స్టన్నింగ్ లుక్స్‌తో చూస్తున్న ఫొటోలకు ‘‘తన భర్త తీసిన ఈ ఫొటోల్లో మీకు ఏది నచ్చింది’’ అని అడిగింది స్నేహ. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు రెండు ఫొటోలూ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

‘‘బోత్ బ్యూటిఫుల్, ఆసం, సో క్యూట్ ’’ అని పోస్టులు పెడుతున్నారు. స్నేహ తెలుగు ప్రేక్షకులకు చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news