EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి సీజన్ కల్లా వడ్డీ క్రెడిట్…!

-

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది చివరి వరకు పీఎఫ్ వడ్డీ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీనిని ముందే పూర్తి చెయ్యాలని అనుకుంటోంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. దసరా-దీపావళి పండగ సీజన్ కంటే ముందే వడ్డీ రేటును క్రెడిట్ చెయ్యాలని అనుకున్నట్టు తెలుస్తోంది.

2022 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 43 ఏళ్ల కనిష్ట స్థాయిల్లో 8.1 శాతంగానే ఉంది. అయితే దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించేలానే కనపడుతోంది. అలానే వడ్డీ రేటును ముందు గానే క్రెడిట్ చేస్తే ఈపీఎఫ్ఓ ఫైనాన్సియల్ హెల్త్‌కు ప్రయోజనం కలుగుతుంది. గత రెండేళ్ల తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ త్వరగా క్రెడిట్ అయ్యేలా కనపడుతోంది. లక్షల మంది ఉద్యోగులకు బోనస్‌లు దసరా దీపావళి పండగ సీజన్‌కు ముందు వస్తాయి.

ఈ సమయం లోనే వడ్డీ రేట్లు ఇచ్చి డబుల్ బోనస్‌లను ఉద్యోగులకు ఇస్తారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటును డిసెంబర్ 2021లో క్రెడిట్ చేశారు. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు మార్చి నెలలోనే పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఈ వడ్డీ రేటు 43 ఏళ్ల కనిష్ట స్థాయి. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఈ కనిష్ట స్థాయిలలో వడ్డీలను ఇవ్వడం జరిగింది. అప్పుడు వడ్డీ రేటు 8 శాతం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని, 2019-19లో 8.65 శాతం వడ్డీని, 2017-18లో 8.55 శాతం వడ్డీని ఇవ్వడం జరిగింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news