“రా రా రక్కమ్మా” సాంగ్ లో దుమ్ములేపిన “శ్రీముఖి”

-

బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పటాస్ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈమె పలు షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా పలు గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ మరింత రెచ్చిపోతూ ఉంటుంది.

అంతేకాదు వెండితెర మీద కూడా ‘నేను శైలజ’ సినిమాలో చాక్లెట్ బాయ్ రామ్‌‌కు సిస్టర్ క్యారెక్టర్ తో అదరగొట్టింది.ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఈ సుందరి అప్పుడప్పుడు కుర్రకారు గుండెల్లో మంట పుట్టేలా పోస్టులు పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా అంటూ తన ప్రతీ అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన హాట్‌ అందాలను చూపిస్తూ.. ఓ పాటకి చిందులేస్తూ రచ్చ చేసింది.

కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా అలరించిన విక్రాంత్ రోనా సినిమాలో “రా రా రక్కమ్మ” పాట తక్కువ సమయంలోనే నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ పాటకి స్టెప్పులేసి అలరించగా.. ప్రస్తుతం ఇదే జాబితాలో చేరింది యాంకర్ శ్రీముఖి. ఏద అందాలను చూపిస్తూ.. శ్రీముఖి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసి కొంతమంది నెటిజెన్స్ మరీ ఇంతలా హద్దుమీరాలా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news