ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది : కిషన్‌రెడ్డి

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను వరంగల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి, టీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూ ఉందన్నారు కిషన్‌రెడ్డి. కాళేశ్వరానికి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసిందన్నారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు కిషన్‌రెడ్డి. రామప్ప దేవాలయం అభివృద్ధికి రూ. 60 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. కేంద్రం నిధులు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ప్రధాని నరేంద్ర నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు కిషన్‌రెడ్డి.

- Advertisement -

Centre to develop all heritage sites: Kishan Reddy

కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు కిషన్‌రెడ్డి. వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని అన్నారని, ఏళ్లు గడుస్తున్నా ఎందుకు కట్టించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్-యాదాద్రి-వరంగల్ వరకు హైవే వేశామని చెప్పారు కిషన్ రెడ్డి. వరంగల్‌లో రూ. 500 కోట్లతో బైపాస్ రోడ్డు వేశామన్నారు కిషన్‌రెడ్డి. జగిత్యాల-వరంగల్ రోడ్డు కోసం రూ. 4,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇవన్నీ తప్పని చెప్పే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? అని కిషన్ రెడ్డి. ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...