శృతి టైం గ్యాప్ అందుకేనా..!

-

విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన శృతి హాసన్ కెరియర్ పరంగా ముందు ఒడిదుడుకులను ఎదుర్కున్నా ఆ తర్వాత వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. అయితే ఏడాదిగా శృతి హాసన్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ప్రేమించిన మైఖేల్ తో పెళ్లికి సిద్ధమైన కారణంగానే శృతి హాసన్ సినిమాలకు బై బై చెప్పేసిందని అనుకున్నారు.

కాని తను తీసుకున్న ఈ గ్యాప్ ఎందుకో చెప్పేసింది శృతి హాసన్. ముందు తన మీద ఇన్నాళ్లు వచ్చిన వార్తలన్ని రూమర్సే అంటూ కొట్టిపారేసిన అమ్మడు తన గురించి తాను తెలుసుకునేందుకు ఈ గ్యాప్ తీసుకున్నానని అంటుంది. తన బలాలు, బలహీనతలు ఇలా అన్నిటిని తెలుసుకునేందుకు గ్యాప్ తీసుకుందట. ఇప్పుడు తన గురించి తనకు పూర్తిగా అర్ధమైందని అంటున్న శృతి హాసన్ మళ్లీ తాను సినిమాల్లో బిజీ అవుతా అని చెబుతుంది.

ప్రస్తుతం మహేష్ మంజ్రేకర్ హిందిలో చేస్తున్న సినిమాతో పాటుగా కమల్ హాసన్ తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో కూడా నటిస్తుంది శృతి హాసన్.

Read more RELATED
Recommended to you

Latest news