RRR Movie: ఆర్ ఆర్ ఆర్ లీక్స్.. ఆ డైలాగ్ వింటే.. అరుపులే!

-

RRR Movie: టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ద‌ర్శక దిగ్గ‌జం ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం మల్టీ స్టార‌ర్స్ గా తెర‌కెక్కు తుండ‌టంతో ఆర్ఆర్ఆర్ కోసం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే.. ప్ర‌ధాన పాత్ర‌ల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

 

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు మూవీమేకర్స్. ఈ నేపథ్యంలో చిత్రప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను మరింత పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి విడుద‌లైన ‘ఆర్ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో డైరెక్ట‌ర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్‌’లోని ఓ డైలాగ్‌ను రివీల్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. తాజాగా రాజ‌మౌళి ఓ కార్యక్రమంలో చీప్ గెస్ట్ గా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్‌’లోని ఓ డైలాగ్‌ను రాజమౌళి పంచుకున్నారు. ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అదీ ధర్మ యుద్దం అయితే.. విజయం
తథ్యం’’ అని డైలాగ్‌ చెప్పారు. అయితే.. సినిమాలో ఈ డైలాగ్‌ ఎవరు చెప్పారు? అనేది సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్రస్తుతం ఈ డైలాగ్ సోష‌ల్ మీడియాలో చ‌ల్ హ‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news