స్టార్ క్రికెటర్ అంటే క్రష్ అంటున్న అనుష్క..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో అనుష్క కూడా ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే అనుష్క పెళ్లి మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంది. నిజానికి అనుష్క, ప్రభాస్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వచ్చాయి. కుటుంబంలో పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారని కూడా వార్తలు వినిపిస్తున్నా వీరి పెళ్లికి సంబంధించిన ఏ ఒక్క వార్త కూడా బయటకు రాకపోవడం గమనార్హం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ను మోసం చేసి స్టార్ క్రికెటర్ పై క్రష్ అంటుంది అనుష్క అంటూ ఇప్పుడు రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క శెట్టి తనకు ఆ క్రికెటర్ పై క్రష్ ఉందని వెల్లడించింది. ఇకపోతే అనుష్క ఒక క్రికెటర్ పై మనసు పారేసుకుందని ఫలితంగా వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే క్రికెటర్ కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ లేదా విరాట్ కోహ్లీ అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం భారత క్రికెట్ జట్టు రాహుల్ ద్రవిడ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది అనుష్క.

అప్పట్లో రాహుల్ ద్రవిడ్ కి ఫుల్ ఫామ్ లో ఫాలోయింగ్ వుండేది. రాహుల్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు. ఇక అలాంటి అమ్మాయిలలో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఒకరు.. ఆమె ఎదుగుతున్నప్పటి నుండి అతడు అంటే చాలా ఇష్టం ఏర్పడిందట. అతనితో ప్రేమలో కూడా పడిపోయింది. ఇకపోతే ఒక నటికి క్రికెటర్పై క్రష్ రావడం ఇదే తొలిసారి కాదు.. అనుష్క కంటే ముందే చాలామంది హీరోయిన్లు హ్యాండ్సం క్రికెటర్ల పై తమ అభిమానాన్ని చాటుకొని ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. మరి ఈమె విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news