గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కాసారిగా భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే.. గోదావరి ఎక్స్‌ప్రెస్ భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్. ఈ రైలు విశాఖపట్నం ⇌ హైదరాబాద్ మధ్యలో నడుస్తుంది. ఈ రైలుని వాల్తేరు ⇌ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ క్రింద ఫెబ్రవరి 1, 1974 న ట్రైన్ నెంబర్లు 7007, 7008 తో ప్రవేశపెట్టారు. ఈ రైలు ప్రస్తుత ట్రైన్ నెంబర్లు 12727, 12728. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా ఈ రైలుకు పూర్తి స్థాయి ఏ.సి సదుపాయం ఉన్న గరీబ్ రథ్, దురోంతో లు ప్రవేశపెట్టటంతో ఈ రైళ్ళలో ప్రజల రద్దీ ఇంకా పెరిగింది.
రెండు కొత్త రైళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ, ఈ రైలుకి ఇప్పటికి భారి రద్దీ ఉంది . ప్రజల డిమాండ్ మేరకు కొన్నిమార్లు రిజర్వేషన్ లేని జనరల్ భోగీలను స్లీపర్, మూడవ క్లాసు భోగిలతో మారుస్తుంటారు.విశాఖ, హైదరాబాద్ మధ్య వెళ్ళు రైలు మార్గాలలో ఈ రైలు వెళ్ళే మార్గాన్ని ఉత్తమంగా భావిస్తారు.