ఆ పాత్రను మిస్ చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్న స్టార్ హీరోయిన్స్..!!

-

మహేష్ బాబు , వెంకటేష్ కలిసి మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో అంజలి, సమంత , తేజస్వి మదివాడ కూడా నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే పెద్దోడుగా విక్టరీ వెంకటేష్.. చిన్నోడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తమ నటనతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అలరించారని చెప్పవచ్చు. ఇక 2013 జనవరి 11వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.54.75 కోట్ల రూపాయల కలెక్షన్ ను రాబట్టింది. అంతేకాదు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది.anjali shares an incident after she got the image with seethamma vakitlo sirimalle chettu, anjali , seethamma vakitlo sirimalle chettu, ,seetha role , interesting facts, - Telugu Anjali, Seetha Roleఅలాగే ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకి, ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజుకి ప్రత్యేక జ్యూరి అవార్డు, అంజలికి నంది అవార్డులు కూడా లభించాయి. మాటల రచయిత గణేష్ పాత్రో కి ఇదే చివరి చిత్రం కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో సీత పాత్రలో అంజలి నటించి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఈ పాత్రకు ప్రముఖ సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు సమంత కూడా ఈ సినిమా నుంచే తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం కొంతమంది స్టార్ హీరోయిన్లను అనుకోగా కానీ వాళ్లు రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర అంజలికి వరించింది . కానీ ఈ సినిమా సక్సెస్ ని చూసి ఆ స్టార్ హీరోయిన్ లు ఇప్పటికి బాధపడుతూ ఉండడం గమనార్హం.

ఇక వారెవరో కాదు త్రిష, స్నేహ, భూమిక ,అనుష్క వీరందరినీ అనుకున్నారు. కానీ చివరికి అమలాపాల్ ని కూడా అడగగా ఆమె ఓకే చెప్పింది . కానీ ఎందుకో షూటింగ్ సమయం వచ్చేసరికి ఆమె తప్పుకుంది. దీంతో అంజలి ఈ సినిమాకు ఓకే అయింది. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా తెరకెక్కించాల్సి వుండగా.. ఈ సినిమాను చివరికి వెంకటేష్ ఓకే చేశారు. ఇక రేలంగి పాత్రలో ప్రకాష్ రాజుకు బదులుగా రాజశేఖర్ నటించాల్సి ఉండగా.. ఆయన తప్పుకోవడంతో ప్రకాష్ రాజ్ ఈ పాత్రలో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news