‘మై హీరో’ అంటూ రాజమౌళి పై సుకుమార్ ప్రశంసల వర్షం..

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి ఈ సినిమా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ వచ్చింది అలాగే ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ బడిలో కూడా ఉంది అంతేకాకుండా తాజాగా ఈ సినిమాకులో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమా టీంకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. అయితే టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు అయితే ఈయన ఎప్పటికప్పుడు దర్శకుడు రాజమౌళి పైన తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు అలాగే ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయన్ని పొగడ్తలతో చెప్పారు అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మరొకసారి రాజమౌళి పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అందనంత ఎత్తులో నిలబెట్టిన రాజమౌళి పై ఉన్న ప్రేమను అభిమానాన్ని ఒక మాటలో చెప్పుకొచ్చారు..

తాజాగా ఈ సినిమా టీం లాస్ ఏంజిల్స్ వెళ్లారు.. ఆస్కార్ నామినేషన్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలవనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న సంగతి తెలిసిందే అయితే అక్కడ రాజమౌళి ప్రసంగిస్తున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన సుకుమార్ మై హీరో అంటూ టాగ్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే సుకుమార్ వర్క్‌తో పాటు ఆయన తీసే సీన్లు తనకు ఎంత నచ్చుతాయో రాజమౌళి చాలాసార్లు ఎన్నో వేదికలపై వెల్లడించాడు. అలాగే రాజమౌళి తీసే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్ల పట్ల సుకుమార్ కూడా తన ఇష్టాన్ని ప్రదర్శించాడు. మొత్తానికి అవకాశం వచ్చినపుడు ఇలా ఒకరికొకరు తమ వర్క్‌ను ప్రశంసించుకుంటూ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news