అర్హత లేకున్నా వచ్చేస్తున్నారు.. రజినీపై దర్శకుడి సంచలన కామెంట్స్

-

రజినీకాంత్ రాజకీయ ప్రవేశం ఎప్పటికీ భేతాళ ప్రశ్నే. ఎప్పుడు వస్తాడో తెలియక అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నాడు. రాజకీయాలు అలా ఉంటే.. సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వరుస ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ మెరుపు వేగంతో చెలరేగిపోతున్నాడు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుందరరాజన్ అనే దర్శకుడు రజినీపై సంచలన కామెంట్స్ చేశాడు.

జయలలిత 72వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సుందరరాజన్ అందరిపై ఫైర్ అయ్యాడు. అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదని తెలిపాడు. అయితే ఎంజీఆర్ ఎప్పుడు సీఎం అయ్యాడో.. అర్హత లేని వారంతా నటనలోకి వచ్చేశారంటూ పరోక్షంగా రజినీని ఉద్దేశించి అన్నాడు.

అంతేకాదు ఎంజీఆర్ ఎన్నడూ తన సినిమాల్లోని విలన్లను చంపలేదని.. కానీ రజినీ, విజయ్, అజిత్ లాంటి వారి సినిమాల్లో చివరకు విలన్ అంతమైపోతాడని తెలిపాడు. అలాంటి మంచి మనిషి కూర్చున్న సింహాసనం మీద కూర్చోవడానికి వీరెలా అర్హులంటూ ప్రశ్నించాడు. రజినీకాంత్ పార్టీ పెట్టి కోయింబత్తూరు లో తొలి సమావేశం నిర్వహిస్తే తిర్పూరు చేరుకునే లోపే చచ్చిపోతాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news