3 బ్రేకప్‌లు.. రెజీనా కసాండ్రాతో ప్రేమాయణం.. షాకింగ్ విషయాలు చెప్పిన సందీప్ !

-

 

తాను ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు అమ్మాయిలను సీరియస్ గా ప్రేమించినట్లు తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వెల్లడించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం కి VI ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9, 2024 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే భైరవ కోన సినిమా ప్రమోషన్ నేపథ్యంలో తాజాగా సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Sundeep Kishan about his love stories

ఈ సందర్భంగా తన లవ్ మేటర్ గురించి రివిల్ చేశాడు హీరో సందీప్ కిషన్. ఒకరితో నాలుగేళ్లు మరొకరితో రెండు సంవత్సరాలు ఇంకొకరితో రెండున్నర సంవత్సరాలు ప్రేమలో ఉన్నానని తాజాగా సందీప్ కిషన్ స్పష్టం చేశారు. కానీ అందరితో బ్రేకప్ అయిందని ఎమోషనల్ అయ్యాడు. అయితే వారి పేర్లను మాత్రం అస్సలు చెప్పలేదు.. ఇకముందు కూడా చెప్పను అని తెలిపారు. పెళ్లికి ఇంకా టైం ఉంది. నేను రెజీనా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉంటాయి. కానీ మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అని సందీప్ కిషన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version