ఈ సారి మిమ్మ‌ల్ని భ‌య‌పెడ‌తాను భ‌రించండి : సునీల్

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జ‌రింగింది.ఈ సినిమాకు రాజ‌మౌళి స్పెష‌ల్ గెస్ట్ గా రాగా సినిమాలో న‌టించిన నటీన‌టులు హాజ‌ర‌య్యారు. ఇక ఈ సినిమాలో క‌మెడియ‌న్ సునిల్ విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. సునీల్ క‌ల‌ర్ ఫోటో సినిమాలోనూ విల‌న్ గా న‌టించి అల‌రించ‌గా ఈ సినిమాలో సునీల్ గెటప్ చూస్తేనే భ‌య‌పెట్టేలా క‌నిపిస్తోంది. కాగా ప్రి రిలీజ్ ఈవెంట్ లో సునీల్ మాట్లాడుతూ….సాధార‌ణంగా ఎవ‌రైనా విల‌న్ కావాల‌నుకుంటే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేసి ఓ ఆరేడేళ్ల‌లో విల‌న్ అవుతారు.

కానీ నేనే మూడు వంద‌ల సినిమాల్లో క‌మిడియ‌న్ గా న‌టించి ఆ త‌ర‌వాత హీరోగా ప‌ది సినిమాలు చేసి ఇప్పుడు విల‌న్ గా మారాను అని అన్నారు. ఈ సినిమాలో త‌న‌ను గ‌త సినిమాల‌తో పోల్చుకోకూడ‌ద‌ని చెప్పారు. ఈ చిత్రంతోనే ఇత‌ర భాష‌ల్లోనూ ప‌రిచ‌యం అవ‌తున్నాన‌ని వాళ్ల‌కు విల‌న్ గానే ప‌రిచయం అవుతున్నా కాబ‌ట్టి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని సునీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.