వారెవ్వా.. కృష్ణ సినిమాలతో ముఖ చిత్రం..ఫ్యాన్స్ ఫిదా..

-

అలనాటి హీరో సూపర్ స్టార్ కృష్ణ సోమవారం గుండె పోటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కృష్ణకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మరణించారు. దాని నుంచి సినీ ప్రేక్షకులు బయటకు రాలేకున్నారు..ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

ఆయన 345 కు పైగా సినిమాలలో కనిపించి మెప్పించారు. ఆయన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.కృష్ణ ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టి పోయి రోజులు గడుస్తున్నాయి. రోజులు అయితే గడుస్తున్నాయి కానీ, కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ ఘటన నుంచి ఇంకా బయటకు రాలేదు..ఈ నేపథ్యంలోనే కృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న కృష్ణ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. కృష్ణ మరణానికి తనదైన శైలిలో నివాళులు అర్పించారు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్‌. ఏకంగా 345 కృష్ణ సినిమాల పేర్లతో కృష్ణ ముఖ చిత్రాన్ని గీసారు..

14 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎక్కడా గీతలు లేకుండా ఈ చిత్రాన్ని వేశారు. 3 గంటల పాటు ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని గీశారు కోటేష్‌. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, కోట్లాది అభిమానుల గుండెల్లో వారు శాశ్వతంగా ఉంటారని కోటేష్‌ అన్నారు..ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news