ద‌టీస్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ అనిపించారుగా..

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తొలి చిత్రం `భైరవి` అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాను కలైజ్ఞానం నిర్మించిన విష‌యం చాలా మందికి గుర్తుండ‌క‌పోవ‌చ్చు.. అయితే ఒకప్పుడు నిర్మాతగా కళ కళలాడిన కలైజ్ఞానం ప్రస్తుతం పేదరికంలో ఉన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేక‌పోవ‌డం దురదృష్టకరం. అయితే ఇక్క‌డే సూప‌ర్ ర‌జ‌నీకాంత్ త‌న ఔదార్యాన్ని నిరూపించుకున్నారు.

నిర్మాత కలైజ్ఞానంకు చెన్నైలో రూ.45 లక్షలతో ఇల్లు కొనిపెట్టి గొప్ప‌ మనసును చాటుకున్నారు. అంతేకాకుండా సోమవారం గృహప్రవేశానికి కూడా హాజరై ఆయనను అబ్బురపరిచారు. దీంతో నిజంగా ద‌టీస్ ర‌జ‌నీకాంత్ అనిపించుకున్నారు.