9:09కి వకీల్‌సాబ్ నుంచి అదిరిపోయే గిస్ట్.. అదేంటో తెలుసా..!

-

హిందీలో విజయవంతమైన `పింక్` తెలుగు రీమేక్‌ `వకీల్‌సాబ్` సినిమాతో పవన్ కళ్యాణ్ వెండితెర పైకి మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఐ సినిమాలో పవన్ సరసన అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి థమన్ స్వరాలు అంధిస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాయి.

వాటికి మంచి ఆదరనే లభించింది. అయితే ఇప్పుడు మరోసారి పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే గిస్ట్ ఫ్యాన్స్ ముందుకి రానుంది. బుధవారం ఉదయం 9.09 గంటలకు `వకీల్‌సాబ్` మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news