ప్రీమియ‌ర్ షోల్లో ‘ సైరా ‘ స‌రికొత్త రికార్డు

-

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాత‌గా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా `సైరా నరసింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా’పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఇక విడుద‌లకు ఇంకొన్ని గంటలే సమయం ఉంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలు వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ షోస్ కన్ఫర్మ్ అవగా చెన్నై సిటీలో సైతం భారీ స్థాయిలో స్పెషల్ షోస్ వేయనున్నారు.

చెన్నైలోని తెలుగు ప్రేక్షకుల కోసం మొదటి రోజు మొత్తం ఉదయం 8 గంటల స్పెషల్ షోలు 50 ఎర్పాటయ్యాయి. ఇది కూడా కేవలం తెలుగు వెర్షన్ వరకే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేయలేదు. ఈమధ్యే విడుదలైన ‘సాహో’కి కూడా 30 స్పెషల్ షోలు వేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ‘సైరా’ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాట విడుదల చేయనుంది. పెద్ద పెద్ద స్టార్లు న‌ట్టించ‌డంతో తమిళ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి క్రేజ్ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news