‘ సైరా ‘ టోట‌ల్ హోల్‌సేల్ బిజినెస్ డీటైల్స్‌

-


మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఈ వయసులోనూ ఎంత మాత్రం తగ్గలేదని సైరా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చెబుతోంది. సినిమాకు రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు అంటే మాటలు కాదు. సినిమాకు ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం ఒక ఎత్తు అయితే… ఆ బడ్జెట్ కు తగినట్లు మార్కెట్‌ చేసుకోవడం మరో ఎత్తు. రు. 250 కోట్లతో తెరకెక్కిన సైరా సినిమా థియేటర్ రైట్స్ రు. 190 కోట్లకు అమ్మిన‌ట్టు తెలుస్తోంది. ఇక శాటిలైట్ హక్కులు ఏకంగా రు. 125 కోట్లకు అమ్ముడుపోయినట్టు వ‌స్తోన్న సమాచారం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

బాహుబలి, సాహో తర్వాత సౌత్ ఇండియాలో ఏ సినిమాకి ఈ రేంజ్‌లో శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ పలకలేదు. దీన్నిబట్టి చిరు స్టామినా ఏంటో ? తెలుస్తోంది. జీ నెట్వర్క్ వాళ్లు తెలుగు – హిందీ – తమిళం – మలయాళం – కన్నడ భాషలకు కలిపి హోల్‌సేల్‌గా రు. 125 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇక తెలుగు వెర్షన్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కోసమే రు. 40 కోట్ల దాకా పెట్టొచ్చని జీ నెట్వర్క్ భావించింది. మిగిలిన నాలుగు భాషలకు కలిపి రు. 85 కోట్లు పెడుతున్నారట.

హిందీలో చిన్నా చితకా హీరోల సినిమాల డబ్బింగ్ హక్కులకే రూ.10 కోట్లకు అటు ఇటుగా రేటు పెడుతున్నారు. బెల్లంకొండ సురేష్ లాంటి ప్లాప్ హీరోల సినిమాల డ‌బ్బింగ్‌ల‌కే మంచి రేటు అంటే.. అమితాబ్‌, చిరు లాంటి వాళ్లు న‌టిస్తోన్న సైరాకు చాలా ఎక్క‌వ రేటే పెట్ట‌వ‌చ్చ‌ని వాళ్లు లెక్క‌లు వేసుకున్నారు. ఇక ఓవ‌రాల్‌గా సైరా సేఫ్ అవ్వాలంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రు.200 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సి ఉంటుంది. అంటే రూ.300 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రావాలి.

Read more RELATED
Recommended to you

Latest news