సాధారణంగా చాలా మంది అనేక కారణాల వల్ల డిప్రెషన్‌కి గురవుతారు. అయితే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ శాతం డిప్రెషన్‌కు గురవుతారని ఓ ఆధ్యాయనంలో తేలింది. డిప్రెషన్ అంటే మనసు బాగా లేకపోవటం, ఏ పనిలోనూ శ్రద్ధ, ఉత్సాహం చూపించకపోవటం దీని లక్షణాలు. ప్రతి పదిమందిలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్న పదిమందిలో ఒకరు ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంది.
అయితే ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే రోజుకి ఏడు గంటలు, అంతకన్నా ఎక్కువ సేపు కూర్చునే స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు మరింత అధికంగా కనిపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పరిసర వాతావారణంతో సంబంధం తగ్గిపోతుందని, ఇది డిప్రెషన్ కు దారి తిస్తుందని పరిశోధకులు అంటున్నారు. మన మెదడులో ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మనం ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడతాయి.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ ఎండార్ఫిన్ లో చురుకుదనం తగ్గి పోతుంది. అంతే కాదు.. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే బాగాలకు రక్త సరఫరా కూడా తగ్గుతుంది. ఇవన్నీ నిరుత్సాహ భావన కలగటనికి దారితీసే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. జీవితంలో సంభవించే ఒడిదొడుకులు, జబ్బుల వల్ల కలిగే బాధ, కొన్ని రకాల మందుల వల్ల కలిగే బాధ, నిద్రలేమి, అతి నిద్ర, అలసట, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో సమస్యలు ఇలాంటివి వల్లే కాదు.. అధికంగా కూర్చోవడం వల్ల కూడా డిప్రెషన్‌కు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.