మహేష్ తో తమన్నా ఐటెమ్ సాంగ్ ?

-

మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

 

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబుతో మిల్కీ బ్యూటీ తమన్న స్టెప్పులు వేయనుందట. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ పాట కోసం తమన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో కూడా వీరు ఓ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news