తారకరత్నకు అరుదైన వ్యాధి.. ‘మెలెనా’ అంత డేంజరా..?

-

గుండెపోటుతో ప్రాణాలతో పోరాడుతున్న తారకరత్నకు అరుదైన వ్యాధి ఉందట.. నారాయణ హృదయాల ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ వ్యాధి పేరే మెలెనా.. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్‌ వస్తుంది.. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు.

మెలినాకు కారణాలు..

ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం.
కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం.
కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది.

మెలెనా లక్షణాలు ఇలా ఉంటాయి…

మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది.
హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు.
ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతులు ఇవన్న మెలెనా లక్షణాలు.

చికిత్సలు..

మెలెనా వ్యాధికి.. పెప్టిక్‌ అల్సర్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్‌ ఎంబలైజేషన్‌, సర్జికల్‌ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది.. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం వల్లే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా వల్ల రక్తపోటుపై ప్రభావం ఉంటుంది.. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది.
ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news