లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కష్టమేనా..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టాడు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్, సాంగ్స్ అన్ని సంచలనంగా మారాయి. ఓ పక్క ఏపి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ఇలాంటి సినిమా వస్తే టిడిపి రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపెడుతుందని సినిమా రిలీజ్ అడ్డుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు టిడిపి శ్రేణులు. మరోపక్క దేవిబాబు అనే టిడిపి అభిమాని చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారని ఎన్నికల టైంలో ఇలాంటి సినిమా రిలీజ్ ను ఆపాల్సిందిగా ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశాడు.

అయితే వర్మ మాత్రం సినిమా రిలీజ్ ఎవరు ఆపలేరని.. అంతగా థియేటర్లో రిలీజ్ అడ్డుకుంటే సినిమాను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. టిడిపి బెదిరింపులకు తానేమి భయపడేది లేదని లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందని అంటున్నారు ఆర్జివి. సినిమా సెన్సార్ టైంలో రిలీజ్ పై ఓ క్లారిటీ వస్తుంది. మరి వర్మ చెప్పినట్టుగా మార్చి 22న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ చేస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నట్టే.

Read more RELATED
Recommended to you

Latest news