లోకేశ్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ మామ?

7

గత ఎన్నికల్లో మంగళగిరిలో టఫ్ కాంపిటిషన్ నడిచింది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి నారాలోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండటంతో.. లోకేశ్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే నార్నె కరెక్ట్ చాయిస్ అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

చినబాబు సీటుపై ఇప్పటికి గానీ క్లారిటీ రాలేదు. చినబాబు సీటు కోసం చంద్రబాబు కాస్త అతిగానే ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే పది దాకా అసెంబ్లీ సీట్లను పరిశీలించిన చంద్రబాబు చివరకు లోకేశ్ కు మంగళగిరిని ఫిక్స్ చేశారు. ఇదివరకు భీమిలీ అనుకున్నారు. తర్వాత విశాఖ ఉత్తరం అనుకున్నారు. తర్వాత ఇంకేదో అన్నారు. చివరకు మంగళగిరిని ఫిక్స్ చేశారు.

అయితే.. లోకేశ్ ను చంద్రబాబు మంగళగిరి నుంచి పోటీకి దించుతుంటే… లోకేశ్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావును దించాలని వైసీపీ ఆలోచిస్తోంది. లోకేశ్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే జూనియర్ ఎన్టీఆర్ మామే కరెక్ట్ అని వైసీపీ యోచిస్తోంది. మంగళగిరి నుంచే లోకేశ్ ను పోటీకి దించితే.. ఆ సీటుకు నార్నె కరెక్ట్ గా సెట్ అవుతారని వైసీపీ అనుకుంటోంది.

గత ఎన్నికల్లో మంగళగిరిలో టఫ్ కాంపిటిషన్ నడిచింది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి నారాలోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండటంతో.. లోకేశ్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే నార్నె కరెక్ట్ చాయిస్ అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

నార్నె పార్టీలో చేరేటప్పుడే.. ఆయనకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేస్తుండటంతో… మంగళగిరి అయితే నార్నెకు సెట్ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ నుంచి నార్నె బరిలోకి దిగితే.. ఏపీ రాజకీయాలు ఇంకా రసవత్తరంగా మారుతాయి. ఓవైపు చంద్రబాబు ఫ్యామిలీ.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్యామిలీ ఎన్నికల్లో తలపడినట్టే.

amazon ad