మాస్ హీరోకు క్లాస్ ఫ్యామిలీ టచ్..‘తలపతి 66’పై భారీ అంచనాలు

‘మహర్షి’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలపతి 66’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.

ఇక ఈ ఫిల్మ్ లో భారీ స్టార్ కాస్ట్ ఉంది. సంగీత, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్ , జయసుధ, యోగి బాబు, ప్రభుతో పాటు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో తలపతి విజయ్ మాస్ ఫిల్మ్స్ ఎక్కువగా చేశారు. బాక్సాఫీసు వద్ద ఆ చిత్రాలు సత్తా చాటాయి కూడా. కాగా, ఈ సినిమాలో విజయ్ వెరీ క్లాసీ లుక్ లో ఫ్యామిలీ తో బాండేజ్ కలిగి ఉంటాడని తెలుస్తోంది.

ఈ సినిమా స్టోరి చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాను తెలుగు వ్యక్తులు దర్శకులు, నిర్మాత తెరకెక్కిస్తున్నప్పటికీ తమిళ్ నేటివిటీకి తగ్గట్లు తమిళ్ భాషకే ప్రయారిటీ ఇస్తారని తెలుస్తోంది.

కేవలం తెలుగు భాషలో ఈ పిక్చర్ డబ్ చేస్తారని టాక్. ఇటీవల విడుదలైన తలపతి విజయ్ క్లాసీ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ కూడా బాగా వైరలవుతోంది. సదరు ఫొటోలో విజయ్ , రష్మిక మందన క్లాసీ స్టిల్స్ ఇచ్చారు.