ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ‘గజిని’ని ఎంత మంది స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారో తెలుసా?

-

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య..నటించిన ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ‘గజిని’ గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇందులో సూర్య నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ..ఇండియన్ సినిమా హిస్టరీలో డిఫరెంట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. అయితే, ఈ పిక్చర్ చేయలేమని దాదాపు డజను మంది హీరోలు చెప్పారు. ఆ హీరోలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

‘గజని’కి ముందర ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘రమణ’ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ పిక్చర్ తో మురుగదాస్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. తన మూడో చిత్రం ‘గజిని’ని ఇంగ్లిస్ మూవీ ‘మెమొంటో’ ఆధారంగా తీయాలనుకున్నారు. స్టోరి రెడీ చేసుకుని తొలుత తనకు బాగా పరిచయం ఉన్న తెలుగు నిర్మాతల వద్దకు వచ్చారు. ప్రొడ్యూసర్ సురేశ్ బాబుకు స్టోరి చెప్పాడు. దాంతో స్టోరి తనకు నచ్చిందని, కథ ఎవరు చేస్తే బాగుంటుందని సురేశ్ బాబును మురుగదాస్ అడిగారట. అప్పుడు మహేశ్ బాబు పేరు చెప్పాడు సురేశ్ బాబు. అలా స్టోరి మొదలు సూపర్ స్టార్ మహేశ్ వద్దకు వెళ్లింది.

స్టోరి విన్న మహేశ్..బాగుందని చెప్పాడట. కానీ, తర్వాత చేయలేనని చెప్పేశాడట. అలా ఆ తర్వాత స్టోరిని వెంకటేశ్ తో చేద్దామనుకున్నారు. పాత్ర డీ గ్లామర్ లుక్ లో ఉండాలని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ, వెంకటేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత అల్లు అరవింద్ ను కలిసి స్టోరి చెప్పగా, పవన్ కల్యాణ్ తో చేద్దామని అరవింద్ చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ మాత్రం ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు.

తెలుగు హీరోలు డీ గ్లామర్ రోల్ చేయడానికి భయపడుతున్నారని భావించిన మురుగదాస్..తమిళ్ హీరోలకు స్టోరి చెప్పడం స్టార్ట్ చేశాడు. కమల్ హాసన్ కు చెప్పగా ఆయన నో చెప్పాడు.

అజిత్ చేస్తానని చెప్పాడు.అలా షూటింగ్ స్టార్ట్ అయింది. ‘మిరథల్’ టైటిల్ తో దాదాపు పది రోజులు షూటింగ్ జరిగింది. తర్వాత సినిమా ఆగిపోయింది.

ఆ తర్వాత ఈ మూవీ స్టోరి సూర్య వద్దకు వెళ్లింది. స్టోరి విని తాను చేస్తానని చెప్పి..పాత్ర కోసం గుండు చేయించుకున్నాడు. అలా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ పిక్చర్ విడుదలై రికార్డులు సృష్టించింది. తెలుగులో ఈ మూవీని అల్లు అరవింద్ విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news