రష్మీ నా జీవితం : సుధీర్ షాకింగ్ కామెంట్స్…..!!

-

జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఆ షోతో పాటు సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట తన స్నేతితుడితో కలిసి తన స్వగ్రామం నుండి హైదరాబాద్ వచ్చిన సుధీర్, ఆ తరువాత పలు సంస్థల ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యానని, అయితే అవేవి తనకు నచ్చకపోవడంతో తనకు తెలిసిన మ్యాజిక్ నే నమ్మకుని పలు షోలు చేసినట్లు గతంలో చెప్పడం జరిగింది. ఆ తరువాత తనకు తెలిసిన వారి ద్వారా ఈటివి లో ఛాన్స్ సంపాదించిన సుధీర్, అనంతరం ఆ ఛానల్ లో ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రోగ్రాం నిర్వాహక సభ్యుల్లో ఒకడిగా చేరాడు.

ఆ తర్వాత తన టాలెంట్ తో షోలో అడుగుపెట్టిన సుధీర్, మెల్లగా ప్రేక్షకుల ఆకట్టుకుని చివరికి సుడిగాలి సుధీర్ పేరుతో ఒక టీమ్ ని ఏర్పాటుచేసుకుని ముందుకు దూసుకెళ్లాడు. ఇక అతి త్వరలో ఆయన నటిస్తున్న సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ప్రేక్షకులా ముందుకు రాబోతోంది. ఇకపోతే నిన్న ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో తన లైఫ్ మరియు కెరీర్ విషయాలు పంచుకున్న సుధీర్, లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నానని, అలానే మధ్యలో తన వెన్నుపూసలో ఒక నరానికి కణితి పుట్టడంతో అనారోగ్యం పాలై నరకవేదన అనుభవించానని చెప్పడం జరిగింది. జబర్దస్త్ తనకు తల్లి వంటిదని, అందులోని ప్రతి ఒక్క సభ్యుడితో తనకు మంచి రిలేషన్ ఉందని అన్నారు.

ఇక తనకు మరియు రష్మీకి మధ్య ప్రేమ నడుస్తోందని, మేము కొన్నాళ్లలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వస్తున్న వార్తలను తాను ఎన్ని సార్లు ఖండించినా అవి ఆగడం లేదని వాపోయారు. తనకు రష్మీ ఒక మంచి స్నేహితురాలని, జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసి రష్మీ పైకి వచ్చిందని, ఆమె జీవితం తనకు ఎంతో ఆదర్శం అని, అలానే ఆమె తో స్నేహం ఎప్పటికీ మరిచిపోలేనిదని కూడా సుధీర్ చెప్పారు. అయితే ఫైనల్ గా రష్మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమె తన జీవితం అని అన్నారు. ఎందుకంటే, నా గురించి ఎవరు, ఎక్కడ మాట్లాడుకున్నా, ముందుగా ఆమె పేరు వారు గుర్తుకు రావడం నిజంగా నా అదృష్టం అని, ఆ విధంగా ఆమె వల్ల నాకు మరింత గుర్తింపు వచ్చిందని సుధీర్ తెలిపారు……!!

Read more RELATED
Recommended to you

Latest news