Sumanth Borra : జనాలను అలరిస్తున్న వేడుక కనరో.. శ్రీరాముడే వరుడు..వీడియో..

-

కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కానీ సందర్బం వచ్చినప్పుడే అది బయటకు వస్తుంది.. సంగీతంలో ఎంతో సాధన ఉంటేనే ప్రపంచం గుర్తిస్తుంది.. చాలామంది సంగీత విద్వాంసులు, సింగెర్స్ ఇలా కష్టపడి పైకి వచ్చినవారు ఇప్పుడు స్టార్ హోదాను అనుభవిస్తున్నారు.. ఇక ఇప్పుడు మరో ఇద్దరు యువ గాయకులు సంగీతంలో తమ టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నారు…వారేవ్వరో కాదు..వెంకటేష్ వుప్పల, సుమంత్ బొర్రా, హనుమాద్రి శ్రీకాంత్ మరియు తల్లాడ సాయికృష్ణ… వీరిద్దరూ కూడా అతి చిన్నవయసులోనే సంగీత సంచలనంగా మారుతున్న సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల…వీరిద్దరూ సొంతంగా నేర్చుకున్న సంగీతంతో అచీవర్స్ అనే సినిమాకి సంగీతమందించారు.

ఇక సుమంత్ బొర్రా తన గొంతును అందించారు. ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ అని లేదు… గతంలో నువ్వే ఒక సైన్యం అంటూ పాడారు.. ఇక ఇప్పుడు మరో పాటతో ప్రేక్షకుల ముందు వచ్చారు..వేడుక కనరో.. శ్రీరాముడే వరుడు..లిరిక్స్ తో సీతారాముల కళ్యాణం కళ్ల ముందు కనిపించేలా ఆ పాట అల్లరిస్తుంది… ఈ మధ్యే విడుదలైన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది… ప్రస్తుతం ఈ పాట లైకులు షేర్ల తో పాటు యమ క్రేజ్ ను అందుకుంటుంది..ఇద్దరు సంగీతంలో కొత్త కొత్త ట్యూన్ లను కంపోజ్ చేస్తూ దూసుకుపోతున్నారు…

ఈ పాట ఆదిత్యమ్యూజిక్ సంస్థ ద్వారా విడుదలవుతుంది.. ఇప్పటివరకు పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి.. ఇలాంటి మరెన్నో పాటలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుందాం.. సంగీతంలో కొత్తధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న.. ఈ యువ గాయకులను ఆదరిస్తారని, అభిమానిస్తారని కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్.. ఇక ఆ పాటను ఒకసారి చూసేయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news