ఆస్కార్ మాదే అంటున్న చెర్రీ- తారక్.. !

-

రామ్ చరణ్ , తారక్ మధ్య స్నేహబంధం ఏ రేంజ్ లో ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇద్దరూ కూడా ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ తమ స్నేహాన్ని అందరితో చాటి చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కలసి ఇద్దరు నటించి ఇప్పుడు ఆస్కార్ లో పోటీ పడుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 95 వ ఆస్కార్ ప్రధానోత్సవ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆస్కార్ రెడ్ కార్పెట్ పై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు రామ్ చరణ్, తారక్.. బ్లాక్ అవుట్ ఫిట్ లో హాలీవుడ్ యాక్టర్స్ దృష్టిని సైతం తమ వైపు తిప్పుకునేలా చేశారు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ – తారక్ చాలా రోజుల తర్వాత ఇలా ఒకేసారి రెడ్ కార్పెట్ పై కలసి హగ్ చేసుకోవడం అభిమానులను మరింత ఆనందానికి గురిచేస్తోంది. వాస్తవానికి తారక్ అమెరికాకి వచ్చి హెచ్సీఏ అవార్డు ఫంక్షన్లో పాల్గొనాల్సి ఉంది. కానీ తారకరత్న మరణంతో ఆయన రాలేకపోయారు. దాంతో రాంచరణ్ మాత్రమే అమెరికా హెచ్సీఏ అవార్డులలో పాల్గొని.. అక్కడ కూడా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు.

ఇక హెచ్ సి ఏ అవార్డ్స్ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఇండియాకు తిరిగి రాలేదు. అక్కడే అమెరికాలోనే ఉంటూ ఆస్కార్స్ కోసం ఎదురు చూశారు. అయితే ఇప్పుడు ఇండియా నుంచి ఆస్కార్ కోసం అమెరికా బయలుదేరిన ఎన్టీఆర్ ఒక్కసారిగా రెడ్ కార్పెట్ పై కనిపించగానే ఆనందాన్ని తట్టుకోలేక రాంచరణ్ హగ్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింటే చాలా వైరల్ గా మారుతుంది. అంతేకాదు వీరిద్దరి స్నేహబంధానికి ఇదే అత్యరుదైన గుర్తింపు అని కూడా చెప్పవచ్చు. అంతేకాదు అక్కడ మీడియా ప్రతినిధులతో ఆస్కార్ మాదే అంటూ చాలా గర్వంగా చెప్పారు ఎన్టీఆర్. ఈ మూమెంట్ చాలా వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news