మేకప్ లెస్ అందాలతో మతిపోగోడుతున్న బుల్లితెర గ్లామర్ క్వీన్..!!

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈమె వెండితెర రంగాన్ని కూడా ఏలుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్, మలయాళం లో కూడా నటిగా తన పరిధిని విస్తరిస్తోంది. తనకు తిరుగులేకుండా చేసుకుంటోంది అనసూయ. ముఖ్యంగా బాలీవుడ్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక ఇటీవల రంగస్థలం, క్షణం వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె మరి ఎంతోమంది అభిమానులు కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే వరుస ఫోటోషూట్లతో గ్లామర్ డోస్ పెంచేసి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఇకపోతే వెండితెరపై తన కెరీర్ ను కొనసాగించడానికి బుల్లితెర జబర్దస్త్ కి దూరమైన విషయం తెలిసిందే . ఇక పలు టెలివిజన్ నెట్వర్క్ లపై ఇతర విషయాలపై దృష్టి పెడుతూ బాగా సంపాదిస్తుంది.

ఇక ప్రస్తుతం బిజీగా భాగంగా విహారయాత్రకు వెళ్లడం చాలా కష్టంగా మారిందట. అందుకే బ్యాంకాక్ బీచ్లలో తన సమయాన్ని ఆస్వాదించినప్పటికీ కొన్ని త్రో బ్యాక్ ఫోటోలను అనసూయ షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలలో ఆమె మేకప్ లెస్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అందమైన చిరునవ్వుతో ఎంతో నాచురల్ గా కనిపిస్తోంది అనసూయ. బ్లూ క్రాప్ టాప్.. లేత నీలం రంగు డెనిమ్ షాట్ ధరించి బీచ్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన నెగెటివిటీ పెరిగినప్పటికీ వాటిని సునాయాసంగా సమయోచిత ప్రవర్తనతో బయటపడే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఒక రోజుకు లక్షల్లో పారితోషకం అందుకునే రేంజ్ కి ఎదిగిపోయింది అనసూయ. ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తూనే, మరొకవైపు కృష్ణవంశీ, రంగ మార్తాండ సినిమాలలో కూడా నటిస్తోంది.