నందమూరి హీరోలకు కలిసొచ్చిన సెంటిమెంట్.. అందుకే బ్లాక్ బస్టర్..!!

ప్రస్తుతం నందమూరి హీరోలకు ఈ కాలం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అఖండ సినిమాతో బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా మరొక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోలు కూడా వరుసగా ఇలా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడం వెనుక ఒక సెంటిమెంట్ ఉందని వార్త బాగా స్పష్టం అవుతుంది. ఇక ఆ సెంటిమెంట్ ఏమిటి? ఆ సెంటిమెంట్ వీళ్లకు ఎలా వర్క్ అవుట్ అయింది? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ముందుగా బాలకృష్ణ విషయానికి వస్తే.. కొన్ని ప్లాపులు వచ్చిన తర్వాత ఆయన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాలో కథ మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాప ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఆ సినిమాకే హైలైట్ అయిందని చెప్పవచ్చు. అలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.RRR: Know In Detail About Child Artist Malli | RRR: 'ఆర్ఆర్ఆర్'లో మల్లి పాత్రలో కనిపించిన చిన్నారి ఎవరో తెలుసా?

ఇక ఎన్టీఆర్ విషయానికి.. ఈయన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా గోండ్రుబిడ్డ మల్లి అనే పాప చుట్టూ ఈ కథ నడవడం జరిగింది. అయితే బాబాయ్ బాలకృష్ణ లాగా అబ్బాయి ఎన్టీఆర్ కూడా ఇదే ఫార్ములాను రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అంతే కాదు దేశం గర్వించ దగ్గ నటుడుగా ఎన్టీఆర్ చలామణి అవుతూ ఉండడం గమనార్హం.

తాజాగా కళ్యాణ్ రామ్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బింబిసార సినిమాలో కూడా ఇలాంటి ఒక ఎమోషనల్ పాయింట్ ఉంది. ఈ సినిమాలో కూడా సినిమా కథ మొత్తం ఒక పాప చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం
దీన్నిబట్టి చూస్తే నందమూరి హీరోలంతా ఒకే రకమైన ఫార్ములాను నమ్ముకుని బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆ పాపల సెంటిమెంట్ వీరికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారని చెప్పవచ్చు. కానీ ఒకే ఫార్ములా తో నందమూరి హీరోలంతా ఇలా తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.