ఇన్నేళ్ల కెరీర్‌లో ఆకాశమే హద్దుగా సూపర్ స్టార్ కెరీర్ గ్రాఫ్..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కొద్దీకాలంలోనే తనదైన స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారాడు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచేసే వయసు 45 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. 45 ఏళ్లలో నటుడిగా 41 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు మహేష్ బాబు.

Mahesh-Babu

1979లో విడుదలైన ‘నీడ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన మహేష్ కనిపించారు. ఈ సినిమాను దాసరి నారాయణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమా వచ్చి నేటితో 41 ఏళ్లు పూర్తయ్యింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణ నటించిన కొన్ని సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సోలో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ‘మురారి’ సినిమాతో మంచి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

అంతేకాక మహేష్ బాబు తన నటనకు ఏడు నంది అవార్డులు అందుకున్నారు. ఇక నేటితరం హీరోలలో అత్యధిక నందులు సొంతం చేసుకున్న హీరోగానూ రికార్డు క్రియేట్ చేశాడు మహేష్ బాబు. బాల నటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. హీరోగా 26 చిత్రాల్లోనటించారు. మొత్తంగా 41 ఏళ్ల కెరీర్‌లో 35 చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు.

ఇక మిగిలిన హీరోలకు భిన్నంగా బ్రాండింగ్‌లోనూ తనదైన ముద్ర వేసిన ప్రిన్స్. ప్రకటనల ద్వారా అత్యధిక పారితోషకం ఆర్జిస్తున్న సౌత్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. త్వరలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో పలకరించనున్నాడు. అంతేకాక ‘బాహుబలి’ ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో స్థానం సంపాదించుకున్న టాలీవుడ్ హీరోగా అరుదైన ఘనత సాధించాడు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news