ఈ వారం ఓటీటి, థియేటర్లో విడుదలయ్య చిత్రాలు ఇవే..!!

-

గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఎక్కువగా ఓటీటి ల హవా బాగానే నడుస్తోందని చెప్పవచ్చు. ఈ ఓటిటి ల కారణంగా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూనే ఉన్నదని చెప్పవచ్చు. దీంతో సినిమాలకు సైతం భారీ నష్టాలు వెలువడుతూనే ఉన్నాయి. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప ఆ సినిమా సక్సెస్ సాధించలేదని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఓటిటి థియేటర్లలో అదరగొట్టే సినిమాలు ఏవో చూద్దాం.

1). ది వారియర్:
హీరో రామ్ డైరెక్టర్ లింగస్వామి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ది వారియర్. ఇందులో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తున్నది. రామ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ చిత్రం ఈనెల 14వ తేదీన థియేటర్ లో విడుదల కానుంది.

2). గార్గి:
హీరోయిన్ సాయి పల్లవి మరొకసారి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ , కన్నడ భాషలలో విడుదలవుతుంది. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది.

3). మై డియర్ భూతం:
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా సరికొత్త కథాంశంతో వస్తున్న చిత్రం మై డియర్ భూతం. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది.

4). శభాష్ మిథూ:
హీరోయిన్ తాప్సి మొదటిసారి క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది
ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

5). విశ్వక్ సేన్ -HIT:
ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రాజ్ కుమార్ దేవ్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ శుక్రవారం విడుదలవుతోంది.

6). డ్రాగన్ గాల్:
రాంగోపాల్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల చేయబోతున్నారు.

ఓటీటిలో విడుదలయ్యే మూవీస్:
1). సమ్మతమే:
కిరణ్ అబ్బవరం , చాందిని చౌదరి కలిసి నటించిన ఈ చిత్రం ఈనెల 15న ఆహా లో విడుదల కానుంది.

2). మా నీళ్ల ట్యాంక్:
హీరో సుమంత్ మొదటిసారిగా వెబ్ సిరీస్లో నటి స్తున్నాడు . ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా ప్రియా ఆనంద్ నటిస్తున్నది .ఈ వెబ్ సిరీస్ ఈనెల 15న ZEE -5 లో విడుదల కానుంది.

3). వాషి:
ఈ సినిమాని మలయాళం లో కీర్తి సురేష్ నటించినది. ఈ చిత్రాన్ని ఒకేసారి అన్ని భాషలలో జులై 17న NETFLEX లో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news