ఈవారం ఓటీటీ/ థియేటర్ లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..!

-

అటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీ లలో కూడా సినీ ప్రియులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ క్రమంలోని ఈ వారం బాక్సాఫీస్ వద్ద అటు ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద కన్నడ చిత్రం కాంతారా ప్రభంజనం సృష్టించింది. కేరళ ఆదివాసీల భూతకోల సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఈ వారంలో ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్:
సంతోష్ శోభన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ఇది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి , సుదర్శన్ కీలక పాత్రలో నటించగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఊర్వశివో రాక్షసివో:
డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

బొమ్మ బ్లాక్ బస్టర్:
నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రాజు విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.

వీటితోపాటు చక్కటి మిస్టీరియస్ లవ్ స్టోరీ, తగ్గేదేలే, జెట్టి , మిలి చిత్రాలు నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.

మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాల విషయానికి వస్తే..
హాట్ స్టార్.. బ్రహ్మాస్త్ర నవంబర్ 4

అమెజాన్ ప్రైమ్:
పొన్నియన్ సెల్వన్ నవంబర్ 4, మై పోలీస్ మాన్ నవంబర్ 4.

నెట్ ఫ్లిక్స్:
ది గోస్ట్ నవంబర్ 4.. కిల్లర్ సాలీ అక్టోబర్ 31, మేనిఫెస్టో సీజన్ 4 నవంబర్ 4, ఎనోలా హోల్ మెస్ 2 నవంబర్ 4, లుకిసిమ్ నవంబరు 4, దావిద్ నవంబర్ 4, బుల్లెట్ ట్రైన్ నవంబరు 4

ఆహా:
అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఎపిసోడ్ 3 నవంబర్ 4, పెట్టకాలి నవంబర్ 4.

Read more RELATED
Recommended to you

Latest news