అన్నా చెల్లెల సెంటిమెంటుతో తెలుగులో వచ్చిన టాప్ సినిమాలు ఇవే..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంటుతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ లోనే ఎవర్ గ్రీన్ చిత్రాలుగా మిగిలిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ రక్షాబంధన్ సందర్భంగా అన్నాచెల్లెల సెంటిమెంట్తో వచ్చిన కొన్ని టాప్ సినిమాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

ముద్దుల మావయ్య:


బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మామయ్య సినిమా అన్నాచెల్లెల సెంటిమెంటుతో తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన యువరత్న రానా సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కడం జరిగింది.

పుట్టింటికి రా.. చెల్లి:Puttintiki Raa Chelli (2004)కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కూడా సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

అర్జున్:Mahesh Babu Trends ™ on Twitter: "Watch #Arjun Movie now on @StarMaaMovies https://t.co/BTEoHk717C" / Twitterఅన్నాచెల్లెళ్లే కాదు అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో మహేష్ బాబు హీరోగా , కీర్తి రెడ్డి అక్కగా నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మహేష్ బాబు సోదరుడు దివంగత రమేష్ బాబు నిర్మించారు.

రాఖీ:Prime Video: Rakhi
మహిళలపై పురుషులు జరుపుతున్న మానసిక, లైంగిక దాడులపై సింహంలా విరుచుకు పడే యువకుడి స్టోరీ ఇది. అన్నాచెల్లెల సెంటిమెంటుతో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అన్నవరం:
అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా అన్నవరం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

గోరింటాకు:
అన్నాచెల్లెళ్ల అనురాగానికి గుర్తుగా తెరకెక్కిన రాజశేఖర్ సినిమా గోరింటాకు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్తసంబంధం, శోభన్ బాబు నటించిన జీవనరాగం, వెంకటేష్ నటించిన గణేష్, అక్కినేని నాగేశ్వరరావు నటించిన బంగారు గాజులు, జగపతిబాబు నటించిన శివరామరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంప్రదాయం, రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన పల్నాటి పౌరుషం, నాగార్జున నటించిన ఆజాద్ చిత్రాలు అన్నీ కూడా అన్నాచెల్లెళ్ల సెంటిమెంటుతో రావడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.