ఎన్టీఆర్ వల్లే ఆ ఇద్దరు హీరోలు కష్టాల నుంచి గట్టెక్కారా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈయన స్వర్గీయ నందమూరి తారక రామారావు మనువడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆయన పోలికలను పుణికి పుచ్చుకున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. నటనలో తన లాగే ప్రేక్షకులను మెప్పిస్తూ..ప్రజలకు ఆయన సహాయం చేయడంలో.. కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో కూడా తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు డబ్బు పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు తన తమ్ముడు కుటుంబానికి ఎటువంటి ఆర్థిక నష్టం రాకుండా చూసుకున్నారు. అంతేకాదు తన కుటుంబానికి ఏమైతే ఖర్చు చేస్తారో తన తమ్ముడు కుటుంబానికి కూడా అంతే స్థాయిలో ఖర్చు చేస్తూ కుటుంబ సభ్యులను ఎంతో సంతోషంగా చూసుకునేవారు ఎన్టీఆర్.NTR for Kalyan Ram?

ఇక స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత అంతటి ఆలోచనలను పొందిన వ్యక్తి ఆయన వారసుడు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎందు కంటే ఒకానొక సమయంలో తన అన్న కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ నష్టపోయారు. అంతేకాదు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించి పూర్తిగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ ను తన సినిమా జై లవకుశ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే బాధ్యతలు కళ్యాణ్ రామ్ కి ఇచ్చి కళ్యాణ్ రామ్ ను అప్పుల బాధల నుంచి బయటపడేశారు. అంతేకాదు సుమారుగా 70% అప్పులు జై లవకుశ సినిమా ద్వారా తీర్చుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకైనా సరే నిర్మాతగా వ్యవహరించే బాధ్యతను తన అన్న కళ్యాణ్ రామ్ కు అందిస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు.Nandamuri Taraka Ratna in Allu Arjun Pushpaకళ్యాణ్ రామ్ ని మాత్రమే కాదు తారకరత్న ను కూడా ఎన్టీఆర్ ఆదుకున్నట్లు సమాచారం. తారకరత్న సినిమాలో హీరోగా ఫెయిల్ అయిన సందర్భంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా ఎవరికీ చెప్పొద్దూ అంటూ ఆర్థిక సహాయం కూడా చేశారు. అలా ఇద్దరు హీరోలు కూడా ఎన్టీఆర్ సహాయంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడగలిగారు.

Read more RELATED
Recommended to you

Latest news