సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్ గా క్రేజీ సంపాదించుకున్న ఈమె తర్వాత మంచి నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందింది టాలీవుడ్ తో పాటు పరిస్థితుల పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒకప్పుడు తను ఎదుర్కొన్న విషాద సంఘటనలను తాజాగా గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది..
సన్ని లియోన్ జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తర్వాత పోర్న్ సినిమాలకు దూరమైనా సన్నీ.. భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఇండియాకు వచ్చి సెటిల్ అయ్యారు. అయితే ఈమె ఒకప్పుడు ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని ఆ సమయంలో తనకు ఎవరైనా అండగా ఉంటే బాగుండు అని కూడా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు..
“పోర్న్ స్టార్‌గా కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నన్ను అసహ్యించుకుంటూ చాలా మెయిల్స్ వచ్చేవి. చంపుతానని కూడా బెదిరించే వారు. అవన్నీ చూస్తుంటే ఇక ఇండియాకు వెళ్లలేనేమోనని అనిపించేది. ఎందుకంటే.. భారత ప్రజలు నాపై చాలా కోపంగా ఉండేవారు. ఆ మెయిల్స్ వచ్చినపుడు నా వయసు 19 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులో మనల్ని చాలా విషయాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. నేను అప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని. నన్ను ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని కాదు. అదేం కాదు అని నాతో చెప్తే బాగుండు అని కూడా అనుకునేదాన్ని కాదు. ఆ అనుభవాలన్నీ చాలా దారుణమైనవి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.