సినీ కళామ తల్లికి పాదాభివందనం..

-

అమ్మా సినీ కళామ తల్లి.. మొదటగా నీకు అందరి తరుపునా పాదాభివందనం.. అందాల ప్రపంచంలా కనిపించే సినీ ప్రపంచం ఎన్నో కష్టాలకు ఎదురీదుతుంది. కనిపించేంత సులువుగా ఉండదు నీ బిడ్డల కష్టం.. నీ బిడ్డలు అందమైన వాళ్ళే కాదు.. అందమైన మనసున్న వాళ్లు కూడా . దేశానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మేముసైతం అంటూ అందరికంటే ముందుండేది నీ బిడ్డలే. విరాళాలే కాదు, తమ బాధ్యతగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచిస్తూ ఉంటారు. ఒక సినిమా పేరు నుండి హీరో, విలన్‌ల పేర్లు మనోబావాలను దెబ్బతీస్తున్న వారి కోసం ఇంతలా మీరు చేసేది.. విషయానికొస్తా.


ఒక ప్రొడక్ట్‌ తయారు చేస్తే అది అందరు కొంటేనే డబ్బులు వస్తాయి.. దాన్ని ఆదరిస్తేనే ఆ తయారీదారు లాభపడతాడు.. మరి వాళ్ళెవరిపై మాకు కోపం రాదు.. వాళ్ళెప్పుడూ తమని ఆదరిన్నవారికి ధన్యవాదాలు గానీ చెప్పారా..? కానీ నీ బిడ్డలు వారికి సక్సెస్‌ వచ్చినా, ఫెయిల్యూర్‌ వచ్చినా పబ్లిక్‌కి ధన్యవాదాలు చెబుతారు.. ఇది బలహీనతనా…? ముమ్మాటికీ కాదు.. కానీ కొందరు దాన్ని బలహీనతగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దేశానికి కరువుచ్చినా, రాష్ట్రాలకు కష్టాలొచ్చినా తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొస్తారే అలాంటి వాళ్ళపైనే ప్రతాపం చూసిస్తారు.. దేవుడంటే సాయం.. సాయం చేసేవాళ్ళే దేవుళ్ళు.. సినిమా హీరోలు తమను ఆరాధించే వారిని ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యరనేదానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

హుద్‌ హుద్‌ తుఫాన్‌ కానీ, మరే భీభత్సం జరిగినా 24 ఫ్రేమ్స్‌ ఒక్క తాటిపైకి వచ్చి మేమున్నామంటూ ఫండ్స్‌ ఇవ్వడం.. ఫండ్‌ రైజింగ్‌ చెయ్యడం ఎన్నోసార్లు చూశాం.. సీసీఎల్‌ అంటూ ఎండలో ఆడినా…? వయసు తేడా మరిచి స్టేజ్‌పై డాన్స్‌ చేసి అలరించినా, తెలియని సంగీతాన్ని ఆలాపించినా అది సహాయం కోసమే..

ఒక సినిమా ప్రారంభమైనప్పడో, మద్యలోనో సినిమా టైటిల్‌ ప్రకటిస్తారు సినిమా బృందం.. అప్పుడు ఎవరూ రారు.. సినిమా రేపు అనంగా మా మనోబావాలంటూ సినిమాను ఆపే ప్రయత్నం చేస్తారు.. ఆ సినిమాను చంపేందుకు సాయశక్తులా కృషి చేస్తారు.. టైటిల్‌ చెప్పినప్పుడే ఆ నిర్మాతలను సంప్రదిస్తే వారు మార్చేస్తారు కదా.. కానీ అలా చెయ్యరు.. వారి ఉద్దేశ్యాలు వేరు కాబట్టే.. మరి అలాంటి వారెప్పుడూ తమవారికో, తమ పక్కింటి వారికో సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా అంటే లేవనే సమాధానమే వినిపిస్తుంది. మరి అలాంటి వారికోసం మీ కష్టంలోంచి వచ్చిన డబ్బును ఉపయోగిస్తారే ఎందుకు..?

ఒక సినిమా తీయడం అంటే ఒక యుద్ధమే… నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఒక సినిమా హిట్‌ అయితే అందరూ హ్యాపీనే.. కానీ ఒకవేళ ఫలితం తేడా వస్తే ఆ సినిమా నిర్మాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేము. ఒక మంచి సినిమా తీసిన నిర్మాతకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఏమైనా ప్రకటిస్తే.. వారికెందుకని మేం అడుతాం.. సెల్ఫీకి నో చెబితే నానా యాగీ చేస్తాం.. కేవలం ఒక్కమాటతో మార్గనిర్థేశ్యం చేసే వారెందరో.. జాగ్రత్తగా ఉండండంటూ వేడుకుంటారు..

అంతెందుకు కరోనా నేపథ్యంలో సినీ పరిశ్ర చూపిన చొరవ ప్రశంసనీయం.. పెద్ద నటుల దగ్గరి నుండి చిన్న నటుల వరకు అందరూ జాగ్రత్తలు చెబుతున్నారు.. జాగ్రత్త జాగ్రత్త అంటూ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఒక్క సినీ రంగం వల్ల ఎంతోమంది జీవనోపాదిపొందుతున్నారు. అలాంటి పరిశ్రమకు తమను ఆదరించిన వారి బాగోగులు చేసే మనసుంది.. ఉంటుంది ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళెందరో అందులో ఉన్నారు కదా మరి..

మిగితా రంగాల వారు ఎంతగా స్పందిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.. మనకెందుకు అనేంతగా ఆలోచన ధోరణి వారిది.. కానీ ఇలాంటి బిడ్డలున్నందుకు నువ్వేంతో అదృష్ష్టవంతురాలివి.. అమ్మా నీకు వందనం.. మా ఆనందంలో, మా ఆపదలో, మా అవసరంలో మాతో ఉండే ప్రతీ ఒక్కరికి పేరు పేరునా మనలోకం తరుపున కృతజ్ఞతలు..

-RK

Read more RELATED
Recommended to you

Latest news