2020 టాలీవుడ్ సంక్రాంతి యుద్ధం హీటెక్కుతోంది…

-

సంక్రాంతి వ‌చ్చిందంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు మజా మామూలుగా ఉండ‌దు. ఇక సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ వార్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్‌తో హీటెక్కిపోతుంటుంది. ప్ర‌తి యేడాది తెలుగు సినిమాల‌కు సంక్రాంతే పెద్ద సీజ‌న్ కావ‌డంతో స్టార్లు ఎంత పోటీ ఉన్నా లెక్క చేయ‌కుండా త‌మ సినిమాల‌ను సంక్రాంతికే రిలీజ్ చేయాల‌ని చూస్తుంటారు. గ‌త నాలుగేళ్లుగా సంక్రాంతికి క్రేజ్ ఉన్న మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Tollywood Movies in 2020 Sankranthi Race

ఇక వ‌చ్చే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వార్ అదిర‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సంక్రాంతికి సినిమా వ‌స్తే టాక్‌తో సంబంధం లేకుండా మినిమం గ్యారెంటీ వ‌సూళ్లు వ‌స్తాయ‌న్న‌దే అందరి ధీమా. ఈ సంక్రాంతికి వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్‌ వినయ విధేయ రామ అంత డిజాస్టర్ అయినప్పటికీ 60 కోట్లకు పైగా వసూళ్లు రావ‌డానికి సంక్రాంతి బ‌రిలో ఉండ‌డ‌మే.

ఇక వ‌చ్చే సంక్రాంతికి ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు – అనిల్ రావిపూడి స‌రిలేరు నీకెవ్వ‌రు లాక్ అయ్యింది. దిల్ రాజు ఉండ‌డంతో ఎంత ప్లానింగ్‌తో ఈ సినిమా వ‌స్తుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా సంక్రాంతి టార్గెట్‌గానే వ‌స్తోంది. ఇప్ప‌టికే సంక్రాంతికే రిలీజ్ అంటూ చెప్పేశారు. ఇక సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా వ‌చ్చి హిట్ కొట్ట‌డం శ‌ర్వానంద్‌కు అల‌వాటే.

ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి అలాగే హిట్ అయ్యాయి. ఇప్పుడు రెండు పెద్ద సినిమాల పోటీ ఉంద‌ని తెలిసినా మ‌ళ్లీ సంక్రాంతికే సై అంటున్నారు. వీటితో పాటు ర‌జ‌నీ ద‌ర్బార్ కూడా ఉంది. ఇక బాల‌య్య – కేఎస్‌.ర‌వికుమార్ సినిమా సంక్రాంతికే అనుకున్నా అది స‌మ్మ‌ర్‌కు వెళ్లిపోవ‌చ్చు. ఏదేమైనా నాలుగు సినిమాల‌తో ఈ సారి బాక్సాఫీస్ వార్ రంజుగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news