అలాంటోడు దొరికితే పెళ్లికి రెడీ..!

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా 15 ఏళ్లుగా కెరియర్ కొనసాగిస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో సందడి చేస్తుంది. తెలుగులో ఆమెకు అవకాశాలు రాకున్నా తమిళంలో మాత్రం మంచి ఫాంలో ఉంది. లాస్ట్ ఇయర్ 96 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రిష మరిన్ని అవకాశాలను అందుకుంటుంది. కొన్నాళ్ల క్రిదంట ఓ బిజినెస్ మెన్ ను పెళ్లాడాలని అనుకోగా ఎంగేజ్మెంట్ తర్వాత ఎందుకో అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

అయితే ముదురు భామలు మీడియా ముందుకొస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లెప్పుడనే.. రీసెంట్ గా త్రిషకు మరోసారి త్రిషను ఆ ప్రశ్న అడిగితే నచ్చినవాడు దొరకాలిగా అనేస్తుంది. తనని ప్రేమించే వ్యక్తి దొరికితే అతన్ని పెళ్లాడుతా అంటుంది. తప్పకుండా ప్రేమించే పెళ్లి చేసుకుంటా అంటుంది త్రిష. తనకు నేను.. అతను నాకు నచ్చితే పెళ్లాడేస్తా.. అయితే ఆ విషయం ముందు మీకు చెప్పాకే చేసుకుంటా అని అన్నది త్రిష. మరి త్రిష మనసు గెలిచుకుని ఆమెతో జీవితాన్ని పంచుకునే అదృష్టవంతుడు ఎవరో చూడాలి.