ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కొత్త సినిమా అనౌన్సుమెంట్….!!

టాలీవుడ్ యంగ్ టైగర్ రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో ఎన్టీఆర్, వీరరాఘవ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. ఇక ప్రస్తుతం మరొక హీరోగా రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే కాసేపటి క్రితం ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా గురించి అఫీషియల్ అంనౌన్సుమెంట్ రావడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ తదుపరి సినిమా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు ఈసారి ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానరైన ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ సినిమాలో ఒక నిర్మాణ భాగస్వామి కానుంది. నిజానికి కొద్దిరోజుల క్రితం నుండి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో ఒక సినిమా రానుంది అనే విషయం ఎంతో వైరల్ అవుతుండగా,

 

ఇక నేడు ఒక్కసారిగా సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ చేస్తున్నారు. మరి అరవింద సమేత మాదిరిగా ఈ సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందా, లేక ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…!!