చిక్కుల్లో పడ్డ బాలయ్య అన్ స్టాపబుల్.. ఏకంగా ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు..!

-

ప్రముఖ ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ అనే సెలబ్రిటీ టాక్ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా నిలిచింది.. ముఖ్యంగా బాలకృష్ణ హోస్టుగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. వేస్తున్న ప్రశ్నలు.. పంచు డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి సీజన్ కి బాగా ఆదరణ రావడంతో రెండవ సీజన్లో చాలామంది సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వకముందే ప్రోమోలు , ఎపిసోడ్లు సోషల్ మీడియాలో లీక్ అయిపోతున్నాయి. దీంతో బాలయ్య షో పరిస్థితి చిక్కుల్లో పడ్డట్టు అయింది.

దీంతో ఎలాగైనా సరే ఇలాంటివి ఆపాలన్న ఆలోచనలో భాగంగా.. తమకు వాణిజ్యపరంగా నష్టం వస్తుందని ఆహా మీడియా బ్రాడ్ కాస్టింగ్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ టాక్ షో అనధికారికంగా స్ట్రీమింగ్ మరియు ప్రసారాలను నిలిపివేయాలని సోషల్ మీడియాలో అందుకు సంబంధించి కంటెంట్ లింకును తొలగించాలని కేంద్రానికి, ఇంటర్నెట్ సేవల సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఇంజక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ సత్యదేవ్ ధర్మాసనం తెలిపింది.

పెద్దపెద్ద సినిమాలకి ఇలాంటి లీకులు తప్పలేదు.. ఇలాంటి సెలబ్రిటీ టాకుల సంగతేంటి అని కూడా మరి కొంతమంది నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు . ఏది ఏమైనా బాలయ్య షో ని మరింత పదిలం చేయడానికి ఢిల్లీ హైకోర్టు ఏకంగా ముందడుగు వేసి కేంద్రానికి సంచలన ఆదేశాలు వెల్లడించింది. ఇకపోతే రేపు ఆహా అన్ స్టాపబుల్ ప్రభాస్ ,గోపీచంద్ ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news