ఈ రోజే వస్తున్న ‘టక్‌ జగదీష్​’

న్యాచురల్‌ స్టార్‌‌ నాని కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ డైరెక్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో వినాయక చవితికి రిలీజ్‌ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్ట్రీమ్‌ కావాల్సిన ఈ చిత్రం అంతకంటే ముందుగానే రిలీజయ్యే ఛాన్స్‌ ఉంది.

లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రకారం ఈరోజు రాత్రి పదిగంటలకే మూవీ స్ట్రీమ్‌ అయ్యే అవకాశాలున్నాయి. తన ప్లాట్‌ఫామ్‌పై డైరెక్ట్‌గా రిలీజయ్యే చాలా సినిమాల్ని అమెజాన్‌ ప్రైమ్‌ కొంచెం ముందుగానే స్ట్రీమ్‌ చేస్తుంటుంది. గత ఏడాది నాని నటించి ‘వి’ మూవీ కూడా అనుకున్న టైమ్‌ కంటే ముందుగా, రాత్రి పది గంటలకే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. దీంతో ‘టక్‌ జగదీష్​’ కూడా ఈ రోజు రాత్రి పది గంటలకే వస్తుందని అంచనా. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్స్‌గా నటించారు.