నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పలు రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసివేశారు. సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు.

వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు. ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతించబోమని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news