కీర్తి సురేష్ కి ఊహించ‌నిది జ‌రిగింద‌ట 

నా గ‌తం గురించి వెన‌క్కి తిరిగి చూసుకునే టైమ్ ఇప్ప‌డు లేదు. ఇప్పుడంతా ముందు చూపే అని అంటోంది కీర్తి సురేష్. నేను శైల‌జ‌తో తెలుగు ఆడియెన్స్ కి ప‌రిచ‌య‌మైన కీర్తి సురేష్ మ‌హాన‌టితో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అల‌నాటి మేటిన‌టి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మ‌హాన‌టి బ‌యోపిక్‌లో సావిత్రిగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి మెస్మ‌రైజ్ చేసింది. సావిత్రి అంటే ఇలానే ఉంటుందా అని నేటి త‌రం అనుకునేలా అద్భుత‌మైన న‌ట‌న‌తో మెప్పించింది. ఇందులో ఆమె విల‌క్ష‌ణ న‌ట‌న‌కు ముగ్ధులైన సినీ మేక‌ర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ క‌డుతున్నారు. స్టార్స్ సైతం ఆమెతో క‌లిసి న‌టించాల‌ని ఉవ్విల్లూరుతున్నారు. ప్ర‌స్తుతం ప‌లు భారీ ప్రాజెక్ట్ ల్లో కీర్తి న‌టిస్తుంది.

ఈ సంద‌ర్భంగా త‌న స‌క్సెస్ ఫుల్ కెరీర్ గురించి, మ‌హాన‌టి గురించి కీర్తి ఓ ఇంట‌ర్వ్వూలో మాట్లాడుతూ, సినీ రంగంలో నేను ఈ స్థాయికి చేరుకుంటాన‌ని  ఊహించ‌లేదు.  చిత్ర రంగంలో చాలా మంది టాలెంటెడ్ యాక్ట‌ర్స్ ఉంటారు. కానీ అవ‌కాశాలు, అందులో మంచి అవ‌కాశాలు కొంత మందికే వ‌స్తాయి. అలాంటి గొప్ప అవ‌కాశాలు నాకు రావ‌డం నా అదృష్టం. నా కెరీర్ గురించి చెప్పాల్సి వ‌స్తే అందులో క‌చ్చితంగా మ‌హాన‌టి గురించి చ‌ర్చించాల్సిందే. అంత‌టి ముఖ్య భూమిక నా లైఫ్‌లో ఆ సినిమా పోషించింది. ఈ  సినిమా స్ర్కిప్ట్ ని అర్థం చేసుకుని చాలా కష్టపడి నటించాను. అంత‌కు మించిన రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఆ ప్ర‌తిఫ‌లం నేను పొందాను. అది ఎంతో గొప్ప‌గా ఉంది. ఈ సినిమా న‌టిగా న‌న్ను బిజీ చేసింది. ఇప్పుడు వెన‌క్కి తిరిగి చూసుకునే టైమ్ కూడా లేదు.

అదే స‌మ‌యంలో ఇప్పుడు ఏది ప‌డితే అది చేయ‌డం లేదు. చాలా సెల‌క్టీవ్‌గా నా పాత్ర‌కి ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌కే ఓకే చెబుతున్నా. ఆయా పాత్ర‌ల్లో నేను చేయొచ్చా? లేదా అని ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి సైన్ చేస్తున్నా. మంచి క‌థ ఉంటేనే సినిమా విజ‌యం సాధిస్తుంది. కాంబినేష‌న్ల వ‌ల్ల కాదు. ఇప్పుడు నా మొద‌టి ప్రాధాన్య‌త క‌థ‌, పాత్ర‌. ఆ త‌ర్వాతే మ‌రేదైనా అని తెలిపింది. ప్ర‌స్తుతం కీర్తి తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని మహేష్ కొనేరు నిర్మిస్తున్నారు. దీంతోపాటు నాగార్జున హీరోగా రూపొందుతున్న మ‌న్మ‌థుడు 2లో కీల‌క పాత్రలో మెర‌వ‌నుంది. అలాగే త‌మిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం, ఆది పినిశెట్టితో క‌లిసి ఓ స్పోర్ట్స్ డ్రామాలో, హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో, మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న మ‌ర‌క్క‌ర్ః అర‌బిక‌డ‌లింటే సింహాం చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.