సాధారణంగా ఇంజినీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులు ఫేస్‌బుక్ లో 8 నుంచి 12 వారాల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు చేస్తుంటారు. అందుకు గాను ఫేస్‌బుక్ ఆ విద్యార్థులకు ఏకంగా 8వేల డాలర్లు (దాదాపుగా రూ.5.6 లక్షలు) చెల్లిస్తుందట.
ప్రపంచంలోని టాప్ 10 కార్పొరేట్ సంస్థల్లో ఫేస్‌బుక్ ఒకటిగా పేరుగాంచింనే విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఆ సంస్థలో పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ లో పనిచేసే వారికి శాలరీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఫేస్‌బుక్‌లో పనిచేసే ఉద్యోగుల జీతాలే కాదు, ఆ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థుల పేమెంట్లు కూడా ఒక రేంజ్‌లో ఉంటున్నాయట. ఈ విషయాన్ని గ్లాస్ డోర్ అనే ఓ సంస్థ తాజా చేపట్టిన సర్వేలో వెల్లడించింది.
సాధారణంగా ఇంజినీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులు ఫేస్‌బుక్ లో 8 నుంచి 12 వారాల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు చేస్తుంటారు. అందుకు గాను ఫేస్‌బుక్ ఆ విద్యార్థులకు ఏకంగా 8వేల డాలర్లు (దాదాపుగా రూ.5.6 లక్షలు) చెల్లిస్తుందట. ఇది ఇతర కంపెనీలు చెల్లించే ఇంటర్న్‌షిప్ పేమెంట్ కన్నా చాలా ఎక్కువని తేలింది.
అయితే ఫేస్‌బుక్‌లో విద్యార్థులు ఎవరైనా సరే.. ఇంటర్న్‌షిప్ చేయాలంటే.. డిగ్రీ లెవల్లో కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై మంచి పట్టు ఉండాలి. ముఖ్యంగా సీ, సీ ప్లస్ ప్లస్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లలో మంచి గ్రిప్ ఉండాలి. దీంతోపాటు ఇంటర్వ్యూలో రాణిస్తే.. అమెరికాలోని ఫేస్‌బుక్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. మరి.. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కసారి ప్రయత్నించి చూడండి..! ఇంటర్న్‌షిప్ చేస్తే.. ఆ తరువాత జీవితమే మారిపోతుంది..!