UnstoppablewithNBKS2 : బాలయ్యకు షోలో మాజీ సీఎం, స్పీకర్

-

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా రెండవ సీజన్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ మొదటి ఎపిసోడ్లో గెస్ట్ గా వచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.

అంతేకాకుండా అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, బాలయ్య రెస్పాన్స్ పొలిటికల్ హీట్ ను మళ్లీ తెరలేపాయని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ బావ అల్లుడితో కలిసి వినోదాన్ని పంచడం నందమూరి అభిమానులను బాగా ఆకట్టుతుంది. ఇక నెక్ట్స్‌ ఎపిసోడ్‌ లోనూ రాజకీయ నాయకులే రానున్నారు. బాలయ్యకు షోలో మాజీ సీఎం, స్పీకర్ మెరిసారు. అదేనండి.. అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత సురేష్‌ రెడ్డి వచ్చే ఎపిసోడ్‌ లో రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆహా. ఈ షో 18న స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news