స‌మంత య‌శోద సినిమా నుంచి అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో య‌శోద సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి చిత్ర బృందం ఆస‌క్తి క‌ర‌మైన అప్ డేట్ ను ప్ర‌క‌టించింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను నేటి నుంచి ప్రారంభం అయింద‌ని చిత్ర బృందం తాజా గా ప్ర‌కటించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి షెడ్యూల్ లో ప‌లు కీలక స‌న్నివేశాల‌ను షూట్ చేశామ‌ని చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 12 వ‌ర‌కు సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది.

అలాగే సంక్రాంతి త‌ర్వాత మూడో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఏడాది మార్చి నెల చివ‌రి వ‌ర‌కల్ల ఈ సినిమా పూర్తి షూటింగ్ ను పూర్తి చేస్తామ‌ని తెలిపారు. దీని త‌ర్వాత అత్యంత త్వ‌ర‌లో య‌శోద సినిమాను పాన్ ఇండియా రెంజ్ లో తెలుగు తో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషాల‌లో ఈ సినిమా ను విడుద‌ల చేయ‌నున్నట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా హ‌రి – హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే శ్రీ దేవి మూవీస్ ప‌తాకం పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.