టాలీవుడ్ లో మరో విషాదం..వల్లభనేని జనార్దన్ మృతి !

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు వల్లభనేని జనార్దన్ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని జనార్దన్..ఇవాళ మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో మరణించినట్లు సమాచారం అందుతోంది. అయితే, వల్లభనేని జనార్దన్ మృతిపై ఇంకా ప్రకటన రాలేదు. కానీ, నిన్న అర్ధరాత్రి మరణించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news